Manchi Matalu Telugu (మంచి మాటలు) - Best 45 Telugu Manchi Matalu Sukthulu

manchi matalu telugu

Manchi Matalu : అందరికి నమస్కారం ఈ బ్లాగ్ లో తెలుగు లో 45 మంచి మాటలు సేకరించాము ఇవి మీకు ఉపయోగ పడతాయని ఆసిస్తున్నాము.

List of Manchi Matalu

1. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే

2. నీడను చూసి భయపడకు దగ్గర్లో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు

3. ప్పుడు బాధ పడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది, అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలవంచుతుంది.

4. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు పెదాలు సైతం పలకలేని భావాలు

5. అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావనే వద్దు

6. ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారి పోక తప్పదు

7. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది

8. కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం

9. అందమైన శరీరం చూసి మురిసిపోకండి ఎందుకంటే. దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే.

10. గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు, మనకు ఈ రెండిటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక ధైర్యమే.

11. జీవితంలో గుర్తులు మిగిల్చే వ్యక్తిగా బతుకు, మరకలు మిగిల్చే వారీగా కాదు.

12. పని ఆనందం అయితే జీవితం సంతోషమే, పని బాధ్యత అయితే జీవితం బానిసత్వ మే.

13. మనకు శత్రువులు అవుతున్నారంటే జీవితంలో వాళ్లు సాధించలేనిది మనం ఏదో సాధించాము అని అర్థం

14. ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ మార్చలేరు, ఎందుకంటే నిన్ను మార్చేది నువ్వు మాత్రమే.

15. గెలుపు కన్నా ఓటమి పాఠాలు నేర్పుతుంది, అది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది.

16. సమస్యలను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాలను చేరుకుంటాడు

17. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది

18. జీవితంలో అన్నీ కోల్పోయిన భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది, దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాల

19. స్వేచ్ఛ విలువైనది, దాన్ని మితంగా లెక్కప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి

20. వంద మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసి చూపటమే మేలు

21. గొప్ప మేధస్సు నడిచిన దారిలో నడవదు, ఇంతవరకూ ఎవరూ ఆవిష్కరించని దారుల్ని వెతుక్కుంటుంది.

22. సాహసం అంటే ఎప్పుడు రగిలి పోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్లీ ప్రయత్నించడం కూడా.

23. శత్రువులను వదిలించుకోవాలంటే, వాళ్లను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేదు.

24. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి.

25. ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు.

26. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసిన ప్రమాదమే

27. విజయాన్ని ఇచ్చేది సామర్థ్యం, దాన్ని నెల కలిగేది నడవడిక.

28. పానకం లో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లే, జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమి నేర్చుకోడు.

29. విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది.

30. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే

31. కేవలం ఊహల తోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు, నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా.

32. మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది

33. గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే, గొర్రెలన్నిమహా జ్ఞానులే

34. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఒక రోజు వ్యర్థ మైపోయింది అని తెలుసుకో

35. ఓడి పోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు.

36. తప్పుచేసి సిగ్గుపడనివారిని సంస్కరించడం ఎవరివల్లా కాదు

37. కత్తి చేసే గాయం కన్నా, మాట చేసే గాయం లోతు.

38. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువు మేలు.

39. ఎగతాళి చేయడం, వ్యంగ్యంగా మాట్లాడటం, వాదనలో సత్తా లేదనడానికి రుజువులు.

40. మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే.

41. బండి ముందుకు తాగేటప్పుడు చక్రం అడుగుభాగం పైకి, పై భాగం కిందికి రాక మానవు. జీవనయానంలో సుఖదుఃఖాలు అంతే.

42. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా, స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి రెట్లు మేలు.

43. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండోసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే.

44. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది.

45. శ్రమ మీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది

Popular posts from this blog

Neethi Vakyalu Telugu (నీతి వాక్యాలు) - Best 75 Telugu Neethi Vakyalu Sukthulu